వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెనుగీకరించి ఆ అమృతభాండాగారాన్ని మనకు అందించారు. సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. "పలికెడిది భాగవతమట నే పలికిన భవహర మగునట" అని తన వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో చెప్పారు.
పోతనప్రణీతమైన ఆంధ్రమహాభాగవమును అనేక మహాపండితులు ప్రసిద్ధ సంస్థలు పుస్తక రూపంలో ముద్రించాయి. అయితే ప్రస్తుత కాలానికి కావలసినట్లు అంతర్జాలం, కంప్యూటర్లలలో చదువు కొనుటకు, దిగుమతికి వీలుగా యూనికోడ్ లిపితో, ఊహా కర్త, సంకలన కర్త, గణనాధ్యాయి శ్రీ ఊలపల్లి సాంబశివ రావు గారు, తెలుగుభాగవతం.ఆర్గ్ (telugubhagavatam.org) అనే భాగవత అమృతభాండాన్ని మన ముందు ఉంచారు.
ఆ భాగవతగ్రంథామృతాన్ని వెండి కలశంలో (PowerPoint) అందించి, ఆ మాధుర్యాన్ని ద్విగుణీకృతం చేయటమే నా ఈ చిరుప్రయత్నం. దీనిలో ఏమయినా సవరణలున్నా, లోపాలున్నా దయచేసి తెలియచేయ గలరు. సరిదిద్దుకొనుటకు ప్రయత్నం చేయగలను.